రేపు మహారాష్ట్రకు చంద్రబాబు.. కొల్లాపూర్ ఆలయాన్ని సందర్శించనున్న టీడీపీ అధినేత
- శ్రీమహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు
- ఆపై షిర్డీ వెళ్లి సాయిబాబా ఆలయ సందర్శన
- ఎన్నికలు ముగిసిన వెంటనే తిరుమల వెళ్లిన బాబు
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్న చంద్రబాబు ఆ తర్వాత మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారణాసి వెళ్లారు. రేపు మహారాష్ట్ర వెళ్తున్నారు. కాగా, ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమాగా ఉన్న చంద్రబాబు ఆలయాల సందర్శనలో బిజీబిజీగా గడుపుతున్నారు.