ఇకపై ఆమె అనుమతితోనే కాంగ్రెస్ లోకి చేరికలు ఉంటాయి: జగ్గారెడ్డి
- దీపాదాస్ మున్షీ అనుమతితోనే చేరికలు ఉంటాయన్న జగ్గారెడ్డి
- పార్టీలో చేరాలనుకునే వారు మున్షీని సంప్రదించాలని సూచన
- కాంగ్రెస్ కు దూరమైన వారు పెద్ద సంఖ్యలో ఘర్ వాపసీ అయ్యారని వెల్లడి
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఇటీవల పెద్ద సంఖ్యలో ఇతర పార్టీల వారిని కాంగ్రెస్ లోకి చేర్చుకున్నారు. పార్టీలో చేరేవారిని బేషరతుగా ఆహ్వానించాలని, అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులను పార్టీలోకి తీసుకోవాలని హైకమాండ్ తెలిపింది. ఈ నేపథ్యంలో పార్టీ చేరికల కమిటీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు.