'నా సిక్స్ ప్యాక్ ఇదే'నంటూ బేబీ బంప్‌తో సమంత ఫన్నీ పోస్ట్!
- బేబీ బంప్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వైనం
- 'మా ఇంటి బంగారం' సినిమా తర్వాత నటనకు విరామం
- గతేడాది డిసెంబర్‌లో దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న సమంత
తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సమంత ఒక ఫొటోను పోస్ట్ చేస్తూ.. తన బేబీ బంప్‌పై దిండును ఉంచుకుని, "నా సిక్స్ ప్యాక్... నిన్ను మళ్ళీ తర్వాత చూస్తాను" అంటూ చమత్కరించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇటీవల తన చిత్రం 'మా ఇంటి బంగారం' విజయోత్సవ సభలో సమంత తన ప్రెగ్నెన్సీ విషయాన్ని మొదటిసారి వెల్లడించారు. "ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఈ సినిమా తర్వాత నేను కొంతకాలం విరామం తీసుకోనున్నాను. మెటర్నిటీ లీవ్ అనంతరం మళ్ళీ మరో కొత్త ప్రాజెక్ట్‌తో అభిమానుల ముందుకు వస్తాను" అని ఆమె పేర్కొన్నారు.
గతేడాది డిసెంబర్‌లో సమంత దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ దంపతులకు రానున్న డిసెంబర్‌లో తొలి సంతానం కలగనుందని సమాచారం. నటుడు నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంతకు ఇది రెండో వివాహం. ప్రస్తుతం ఈ జంటకు అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.