సీఎం చంద్రబాబు జిల్లాల బాట.. నేటి నుంచి ఐదు రోజుల పర్యటన

Chandrababu Naidu district tour five day visit from today
  • నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో పర్యటించనున్న సీఎం
  • ఇవాళ నెల్లూరులో పెన్షన్ల పంపిణీ, తిరుపతిలో హీరో మోటార్స్‌కు శంకుస్థాపన
  • రూ.750 కోట్ల పెట్టుబడితో హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ ఏర్పాటు
  • రేపు మంగంపేట, తిరుపతిలో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇవాల్టి నుంచి ఐదు రోజుల పాటు ఆయన నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని పున్నపువారిపాలెంలో నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన తిరుపతి జిల్లా సత్యవేడుకు బయలుదేరి వెళ్లారు. అక్కడ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హీరో మోటార్స్‌కు చెందిన గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కేంద్రాన్ని హీరో మోటార్స్ సంస్థ సుమారు రూ.750 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేస్తోంది.

ఈ కార్యక్రమం ముగిశాక ముఖ్యమంత్రి ఇవాళ రాత్రికి శ్రీసిటీలోనే బస చేయనున్నారు. రేపటి పర్యటనలో భాగంగా మంగంపేటలో 'వీబీ జీ రామ్‌జీ' ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం తిరుపతిలో జరగనున్న జీఎస్‌డీపీ సదస్సుకు చంద్రబాబు హాజరవుతారు.
Advertisement
Chandrababu Naidu
AP CM District Tour
NTR Bharosa Pension
Hero Motors Satyavedu
Andhra Pradesh Development Programs
Tirupati GSDP Conference

More Telugu News