ఓటీటీలో దూసుకుపోతున్న మైథలాజికల్ హారర్ థ్రిల్లర్!
- హిందీలో రూపొందిన 'తవ్వై'
- థ్రిల్లర్ జోనర్ లో నడిచే కథ
- ప్రధానమైన పాత్రలో నటించిన అర్పిత్ రంకా
- జియో హాట్ స్టార్ ద్వారా అందుబాటులోకి
- జూన్ 29 నుంచి మొదలైన స్ట్రీమింగ్
బాలీవుడ్ సినిమాలు .. సిరీస్ లు .. సీరియల్స్ చూసేవారికి అర్పిత్ రంకా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. 'మహాభారతం'లో దుర్యోధన పాత్రధారి అంటే వెంటనే వాళ్లకి గుర్తుకు వచ్చేస్తుంది. అలాంటి అర్పిత్ రంకా ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా ఇది. ఈ నెల 29వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఉహిచని రీతిలో దూసుకుపోతోంది. భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమాకి, నిర్భయ్ జరీవాలా - జయేశ్ వృషీరాజ్ దర్శకత్వం వహించారు.
ఈ కథ 18వ శతాబ్దంతో ముడిపడి ఉంటుంది. ఆ కాలానికి చెందిన ఒక రాజు చేసిన ఒక పొరపాటు కారణంగా ఒక దుష్టశక్తి బంగారు ఆభరణాలను ఆవహించి ఉంటుంది. ఆ నగలను ఎవరూ ధరించనంతవరకూ ఆ దుష్టశక్తి నిద్రాణంగా ఉంటుంది. ఎవరైతే ఆ నగలను ధరించారో వాళ్లను నానా ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటుంది. అలాంటి ఆ దుష్టశక్తి నుంచి ఒక కుటుంబం ఎలా బయటపడిందనేదే ఈ సినిమా కథ. ప్రస్తుతం హిందీలో మాత్రమే ఉన్న ఈ సినిమా, త్వరలో తెలుగులోను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.