సుమతీ శతక పద్యంతో కేటీఆర్ సంచలన పోస్ట్!
- కనకపు సింహాసనమున..పద్యాన్ని షేర్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
- పెద్దలు ఎప్పుడో చెప్పారంటూ కామెంట్, తన పోస్టులో ఎవరి పేరునూ ప్రస్తావించని వైనం
- రేవంత్‌ను ఉద్దేశించే కేటీఆర్ ఈ పోస్ట్ పెట్టారంటూ నెట్టింట ప్రచారం
కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ పార్టీని భూస్థాపితం చేస్తామని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిన్న నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ బూత్ లీడర్స్ కన్వెన్షన్‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 'ఆట మొదలైంది కాస్కో' అంటూ కేసీఆర్‌ను ఈ సందర్భంగా హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీని గత ఎన్నికల్లో ఓడించామని, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను సరిహద్దుల నుంచి తరిమేద్దామంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.