నేడు లావణ్య త్రిపాఠి పుట్టినరోజు... ఆసక్తికర ఫొటో పంచుకున్న సాయిధరమ్ తేజ్
- ఇటీవలే పెళ్లితో ఒక్కటైన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి
- విదేశాల్లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న జంట
- నేడు లావణ్య త్రిపాఠి పుట్టినరోజు
- తనదైన శైలిలో విషెస్ తెలిపిన సాయిధరమ్ తేజ్
కాగా, ఇవాళ (డిసెంబరు 16) లావణ్య త్రిపాఠి పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో, మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఆమెకు వినూత్న రీతిలో ఆసక్తికర ఫొటోతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.
లావణ్య, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఈ ఫొటోలో ఉన్నారు. లావణ్య చిరునవ్వులు చిందిస్తుండగా, సాయిధరమ్ తేజ్ ఆమె వైపు తదేకంగా చూస్తుండగా, వరుణ్ తేజ్ కోరచూపులు చూస్తుండడం గమనించవచ్చు. ఈ ఫొటోలోని సీన్ కు అనుగుణంగా సాయిధరమ్ తేజ్ ఆసక్తికరమైన స్క్రిప్టు కూడా జత చేశాడు.
ఓహ్... ఆప్.. ఓకే ఓకే (ఓహ్... మీరా... అయితే సరే)
హ్యాపీ హ్యాపీయెస్ట్ బర్త్ డే లావణ్య త్రిపాఠి
నువ్వు చల్లగా ఉండు... మా వరుణ్ తేజ్ బాబుని చల్లగా ఉంచు... అంటూ ట్వీట్ చేశాడు. నెటిజెన్ల నుంచి ఈ పోస్టుకు విశేషమైన స్పందన వస్తోంది.