ఏపీలో విషాద ఘటన.. ఏకే-47తో కాల్చుకున్న ఎస్సై

ఏపీలో విషాద ఘటన.. ఏకే-47తో కాల్చుకున్న ఎస్సై

Tragedy in AP SI shoots himself with AK 47
  • అల్లూరి జిల్లా దుంబ్రిగూడలో తీవ్ర విషాదం
  • పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏఆర్ ఎస్సై ఆత్మహత్యాయత్నం
  • అరకు ఏరియా ఆసుపత్రిలో అత్యవసర చికిత్స

ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్‌లో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. డుంబ్రిగూడ పీఎస్‌లో ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గంప సత్యనారాయణ ఏకే-47 తుపాకీతో స్టేషన్ ప్రాంగణంలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తుపాకీ నుంచి పేలిన బుల్లెట్లు ఆయన ఛాతీ భాగంలోకి దూసుకెళ్లడంతో ఆయన రక్తమడుగులో కుప్పకూలిపోయారు.


కాల్పుల శబ్దం విని వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న ఎస్సై సత్యనారాయణను హుటాహుటిన సమీపంలోని అరకు వ్యాలీ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తుండగా, పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్సై సత్యనారాయణ ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి కుటుంబ కలహాలా? లేక విధుల నిర్వహణలో తీవ్రమైన ఒత్తిడి ఏమైనా కారణమా? అనే కోణంలో ఉన్నతాధికారులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
Gampa Satyanarayana
Dumbriguda Police Station
AK 47 shooting
Alluri Sitarama Raju district
Andhra Pradesh Police
AR SI suicide attempt

More Telugu News