రేపు తిరుమల వెళుతున్న చంద్రబాబు.. రాత్రి అక్కడే బస

రేపు తిరుమల వెళుతున్న చంద్రబాబు.. రాత్రి అక్కడే బస

Chandrababu Naidu to visit Tirumala tomorrow and stay overnight
  • రేపు సాయంత్రం 4 గంటలకు ఉండవల్లి నుంచి బయల్దేరనున్న చంద్రబాబు
  • రాత్రి 7.55 గంటల తర్వాత శ్రీవారిని దర్శించుకోనున్న ముఖ్యమంత్రి
  • ఎల్లుండి పలు ప్రారంభోత్సవాలకు హాజరుకానున్న సీఎం
సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు తిరుమలలో కొలువుదీరిన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ఆయన ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చర్ కళాశాల గ్రౌండ్‌కు చేరుకుంటారు. రాత్రి 7.40 గంటలకు తిరుమల ఆనంద నిలయం ఎదురుగా ఉన్న బేడీ ఆంజనేయస్వామిని దర్శించుకున్న తర్వాత, 7.55 నుంచి 9.15 గంటల మధ్య శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రేపు రాత్రికి శ్రీ గాయత్రి నిలయంలో ముఖ్యమంత్రి బస చేయనున్నారు.

సెప్టెంబర్ 16న (ఎల్లుండి) ఉదయం 8.40 గంటలకు తిరుమల వీక్యూసీ-1లో పిల్‌గ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. ఉదయం 9.15 గంటలకు గోగర్భం డ్యామ్ సర్కిల్ వద్ద ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించనున్నారు. 9.35 గంటలకు ఎస్వీ మ్యూజియం ప్రారంభోత్సవం నిర్వహిస్తారు. ఉదయం 10.25 నుంచి 11.25 గంటల వరకు శ్రీ పద్మావతి రెస్ట్ హౌస్‌లో సమావేశాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.25 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి 1.55 గంటలకు ఉండవల్లి నివాసానికి తిరిగి చేరుకోనున్నారు. 

రేపు ప్రారంభమయ్యే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్రతోపాటు ఆలయ పండితులు సీఎంను ఆహ్వానించిన విషయం తెలిసిందే.
Advertisement
Chandrababu Naidu
Tirumala Tirupati
Srivari Brahmotsavam
Pattu Vastram Presentation
TTD Chairman BR Naidu
Tirupati Electric Buses Launch

More Telugu News