రేవంత్ ప్రభుత్వానికి గణనాథుడు సద్బుద్ధిని ప్రసాదించాలి: రాంచందర్ రావు

రేవంత్ ప్రభుత్వానికి గణనాథుడు సద్బుద్ధిని ప్రసాదించాలి: రాంచందర్ రావు

Ramchander Rao says Lord Ganesha should give good sense to Revanth government
  • గణేశ్ మండప నిర్వాహకులకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సహకరించాలన్న రాంచందర్ రావు
  • రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వినాయకుడిని కోరుకున్నానని వెల్లడి
  • ప్రజల్లో ఏటేటా భక్తిప్రపత్తులు ఇనుమడిస్తున్నాయన్న రాంచందర్ రావు

తెలంగాణ రాష్ట్రంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించుకోవడానికి గణేశ్ మండప నిర్వాహకులకు విధిగా పూర్తిస్థాయి సహకారం అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసేలా, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా రేవంత్ రెడ్డి సర్కార్‌కి ఆ విఘ్నేశ్వరుడు ‘సద్బుద్ధి’ని ప్రసాదించాలని తాను వేడుకున్నట్లు వ్యాఖ్యానించారు.


రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం పాడిపంటలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ప్రతీ కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించేలా గణనాథుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు. ఏటా గణేశ్ ఉత్సవాల పట్ల ప్రజల్లో భక్తిప్రపత్తులు ఇనుమడిస్తున్నాయని, ఊరూరా ప్రజలు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో భాగస్వాములు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. భక్తులకు, మండపాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు భద్రతా, రవాణా ఏర్పాట్లను పటిష్ఠం చేయాలని సూచించారు.

Advertisement
Ramchander Rao
Revanth Reddy
Ganesh Chaturthi Telangana
BJP Telangana
Eatala Rajender
Ganesh Navaratri celebrations

More Telugu News