వినాయక చవితి వేళ... పురాణపండ 'గౌరీపుత్ర' సందడి

వినాయక చవితి వేళ... పురాణపండ 'గౌరీపుత్ర' సందడి

Puranapanda Srinivas Gauriputra book creates a buzz during Vinayaka Chavithi
  • పురాణపండ శ్రీనివాస్ ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ గ్రంథం
  • ఈ పుస్తకానికి భక్తుల నుంచి భారీ స్పందన
  • వ్రతకల్పం, స్తోత్ర వ్యాఖ్యానాలతో ఆకట్టుకుంటున్న కంటెంట్
  • అందమైన చిత్రాలు, నాణ్యమైన ముద్రణతో ప్రత్యేక రూపకల్పన
  • వేల సంఖ్యలో భక్తుల చేతుల్లో కనిపిస్తున్న ఆధ్యాత్మిక గ్రంథం
ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత, జ్ఞాన మహాయజ్ఞకేంద్రం వ్యవస్థాపకులు పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అనే గ్రంథం గణేశ నవరాత్రుల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు సహా పలు ప్రధాన నగరాల్లో ఈ పుస్తకానికి భక్తుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.

ఈ గ్రంథంలో శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పంతో పాటు ఆదిశంకరాచార్యులు, ప్రాచీన రుషులు రచించిన ముఖ్యమైన స్తోత్రాలు ఉన్నాయి. వీటికి పురాణపండ శ్రీనివాస్ అందించిన వ్యాఖ్యానం సరళమైన, సౌందర్యవంతమైన భాషలో ఉండటంతో పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటోందని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అరుదైన గణపతి వర్ణ చిత్రాలు, ఆకర్షణీయమైన డిజైన్‌తో పుస్తకం ప్రత్యేకంగా నిలుస్తోంది. తెలంగాణ సచివాలయంలోని పలువురు అధికారులు సైతం పుస్తక రూపకల్పన, కంటెంట్‌ను మెచ్చుకుంటున్నారు.

    
ఏ ఫోర్ సైజులో, జపాన్ ఆర్ట్ పేపర్‌పై డిజిటల్ ప్రింటింగ్‌తో అత్యంత నాణ్యంగా ముద్రించిన ఈ పుస్తకం వేల సంఖ్యలో భక్తులకు చేరువైంది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బడా గణేశ్ మండపంతో పాటు కూకట్‌పల్లి, మణికొండ, గచ్చిబౌలి వంటి ప్రాంతాలు, పలు ప్రముఖ కాలనీలలో భక్తుల చేతుల్లో ఈ గ్రంథం కనిపిస్తోంది.

కిమ్స్ హాస్పిటల్స్ ఛైర్మన్ బొల్లినేని కృష్ణయ్య, వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి వంటి ప్రముఖుల సహకారంతో ఈ పుస్తకాన్ని భక్తులకు అందిస్తున్నారు. దాదాపు 100 పేజీలతో, మంత్ర, తంత్ర, యంత్రాత్మక విశేషాలతో కూడిన ఈ గ్రంథాన్ని ఒక "మంగళ మంత్ర పేటిక"గా తీర్చిదిద్దారు. రచయితగా పురాణపండ శ్రీనివాస్ శైలికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారని, వారందరికీ ఈ గణపతి నవరాత్రుల వేళ ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ ఒక అక్షర కానుకగా నిలిచిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Puranapanda Srinivas
Gauriputra Namasthestu
Ganesh Chaturthi
Vinayaka Chavithi
Spiritual Telugu Books
Vratakalpam

More Telugu News