‘స్వీపర్ ఉద్యోగం కూడా రాలేదు’.. రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు
- రాఖీ సావంత్‌పై మరోసారి ఫైర్ అయిన కంగన
- సక్సెస్ అయిన మహిళల్ని కించపర్చి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలనుకుంటుందని పరోక్ష వ్యాఖ్య
- ఎన్ని ప్రయత్నాలు చేసినా రాఖీ సావంత్‌కు స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదని విమర్శ
- తాను మాత్రం ముందుకు వెళుతూనే ఉంటానని వ్యాఖ్య
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, నటి రాఖీ సావంత్ మధ్య మరోసారి మాటల యుద్ధం రేగింది. తనపై రాఖీ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలకు కంగనా ఘాటుగా స్పందించింది. తనను విమర్శించేవారు అసూయతోనే వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని మండిపడింది.
రాఖీ వ్యాఖ్యలతో కూడిన ఓ వార్త కథనాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కంగనా షేర్ చేసింది. విజయవంతమైన మహిళలను కించపరచడం ద్వారా కొందరు తమ వైఫల్యాలను, అసూయను సమర్థించుకోవాలని చూస్తున్నారని పేర్కొంది. ఇలాంటి వ్యక్తిగత దాడులకు ఇకపై బాధపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది.
అంతేకాదు.. రాఖీని ఉద్దేశించి కంగనా మరింత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు, పరిచయాలు ఉన్నా ఆమెకు కనీసం ‘స్వీపర్ ఉద్యోగం’ కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. ఆ పని చేయడానికి కూడా కొంత సామర్థ్యం, ప్రతిభ అవసరమని వ్యాఖ్యానించారు. తాను మాత్రం ముందుకు వెళుతూనే ఉంటానని, రాఖీ తన రీల్స్ చూస్తూ ఏడుస్తూ ఉండొచ్చంటూ వ్యంగ్యంగా స్పందించారు.
ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. బీజేపీ నేతలు కంగనా రనౌత్, స్మృతి ఇరానీల రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ ఆమె వ్యక్తిగత జీవితంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
కంగనా, రాఖీ మధ్య వివాదం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. జనరేషన్-జెడ్‌పై కంగనా చేసిన వ్యాఖ్యల సమయంలో రాఖీ ఆమెను తీవ్ర పదజాలంతో విమర్శించారు. ఇప్పుడు మరోసారి వ్యక్తిగత విమర్శలతో ఈ వివాదం హాట్‌టాపిక్‌గా మారింది.