వివాదంలో సాలార్ జంగ్ మ్యూజియం.. హైదరాబాద్ సంస్థానంపై తప్పుడు పోస్ట్!
- హైదరాబాద్ సంస్థానంపై తప్పుడు మ్యాప్‌తో సాలార్ జంగ్ మ్యూజియం పోస్ట్
- చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఫోటో కూడా తప్పుగా ప్రచురణ
- ఇది ఏఐ-జనరేటెడ్ కంటెంట్ అంటూ జర్నలిస్ట్ ఆరోపణ
- కేంద్ర సాంస్కృతిక శాఖ నుంచి వచ్చిన సమాచారంతోనే పోస్ట్ చేశారని వెల్లడి
- విమర్శలు వెల్లువెత్తడంతో సోషల్ మీడియా నుంచి పోస్టును తొలగింపు
హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక సాలార్ జంగ్ మ్యూజియం సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ వివాదాస్పదంగా మారింది. నిజాం పాలన నాటి హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి చారిత్రక తప్పులతో కూడిన మ్యాప్‌ను, చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు చెందిన తప్పుడు ఫొటోను తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మ్యూజియం పోస్ట్ చేసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో మ్యూజియం యాజమాన్యం ఆ పోస్టును తక్షణమే తొలగించింది.
ఈ పోస్టులో చూపించిన హైదరాబాద్ సంస్థానం (1724–1948) సరిహద్దుల మ్యాప్ వాస్తవానికి పూర్తి భిన్నంగా ఉంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో సృష్టించినట్లుగా ఉందని జర్నలిస్ట్ శిరీష్ నానిశెట్టి 'ఎక్స్' వేదికగా ఆరోపించారు.
కేంద్ర సాంస్కృతిక శాఖ నుంచి అందిన మెటీరియల్ ఆధారంగానే ఈ కంటెంట్‌ను పోస్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఉన్నత స్థాయి నుంచి వచ్చిన సమాచారం కావడంతోనే ఈ పొరపాటు జరిగిందని తెలుస్తోంది. విమర్శలు తీవ్రం కావడంతో మ్యూజియం అధికారులు వెంటనే ఆ ఫోటోలను తొలగించారు.
భారతదేశంలోనే అతిపెద్ద సంస్థానమైన హైదరాబాద్, ప్రస్తుత తెలంగాణాతో పాటు మహారాష్ట్రలోని ఐదు, కర్ణాటకలోని మూడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉండేది. 1948 సెప్టెంబర్ 13న ప్రారంభమైన 'ఆపరేషన్ పోలో' సైనిక చర్యతో ఈ సంస్థానం భారత్‌లో విలీనమైంది.