కరీంనగర్‌లో గంగులను చిత్తుగా ఓడిస్తా: బీజేపీ నేత బండి సంజయ్

Bandi Sanjay challenges Gangula Kamalakar
  • తన ఆస్తులకు సంబంధించిన పత్రాలతో వస్తే వాటిని పంచుతానన్న బండి సంజయ్
  • నీ ఆస్తులు కూడా పంచే దమ్ము ఉందా? అని ప్రశ్న
  • ప్రజల తరఫున పోరాటం చేశానన్న బండి సంజయ్
తనపై విమర్శలు గుప్పించిన మంత్రి గంగుల కమలాకర్‌కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. తన ఆస్తులకు సంబంధించిన పత్రాలతో మంత్రి గంగుల వస్తే, తన పేరిట ఉన్న ఆస్తులన్నింటినీ తాను కరీంనగర్ ప్రజలకు పంచుతానన్నారు. మరి తనలాగే నేను పత్రాలు తీసుకువస్తే తన ఆస్తులను ప్రజలకు పంచే ధైర్యం ఉందా? అన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి ఇప్పటి వరకు నియోజకవర్గంలో రేషన్ కార్డులు ఇవ్వని వ్యక్తి... మళ్లీ గెలిపిస్తే రేషన్ కార్డులు ఇస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను ప్రజల తరఫున పోరాటం చేశానని, అందుకే తనపై 74 కేసులు ఉన్నాయన్నారు. కుటుంబాన్ని పక్కన పెట్టి మరీ ప్రజల కోసం కొట్లాడుతున్నానన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గంగులను చిత్తుగా ఓడిస్తానన్నారు.
Go Back to Shorts
Bandi Sanjay
BJP
Karimnagar District
Telangana Assembly Election

More Telugu News