ఐఫోన్-17 కొనాలనుకుంటే త్వరపడండి.. ఆగస్టులో ధరలు పెరిగే అవకాశం!
- దేశంలో ఐఫోన్ 17 స్టాక్ కొరత
- పలు స్టోర్లలో అందుబాటులో లేని ఫోన్
- ఆగస్టులో ధరలు పెరిగే అవకాశం
- బేస్ మోడల్‌పై రూ.12 వేల వరకు పెరిగే ఛాన్స్
- ప్రో మోడళ్ల ధరలూ పెరగొచ్చంటున్న ఇండస్ట్రీ వర్గాలు
- ఇంకా అధికారికంగా ప్రకటించని యాపిల్
దేశంలో ఐఫోన్ 17 కొనాలనుకునే వారికి త్వరలోనే షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పలు నగరాల్లో ఐఫోన్ 17 స్టాక్ కొరత నెలకొంది. ఆగస్టు తొలి వారంలోనే ఈ సిరీస్ ధరలు పెరగొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనిపై యాపిల్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
ఢిల్లీ, నోయిడా సహా పలు నగరాల్లోని యాపిల్ స్టోర్లు, అధీకృత డీలర్ల వద్ద ఐఫోన్ 17 పరిమితంగానే అందుబాటులో ఉంది. కొన్ని ఈ-కామర్స్ వేదికల్లో ఈ ఫోన్ ‘ఔటాఫ్ స్టాక్’గా కనిపిస్తోంది. యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఆర్డర్ చేసే అవకాశం ఉన్నప్పటికీ, డెలివరీకి రెండు నుంచి మూడు వారాల సమయం పడుతోంది.
ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ఐఫోన్ 17 ధరను పెంచనున్నట్లు యాపిల్ డీలర్లకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.82,990గా ఉన్న బేస్ మోడల్ ధరను రూ.94,990కు పెంచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అంటే దాదాపు రూ.12 వేల వరకు పెరుగుదల ఉండొచ్చని అంచనా. అలాగే ఐఫోన్ 17 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్ల ధరలు కూడా పెరగొచ్చని ప్రచారం జరుగుతోంది.
ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (ఏఐఎంఆర్‌ఏ) వ్యవస్థాపక ఛైర్మన్ కైలాశ్ లఖ్యానీ ప్రకారం.. గత వారం రోజులుగా ఐఫోన్ 17 సరఫరా తగ్గింది. ఈ కొరత మరో వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులు కొనసాగవచ్చని ఆయన తెలిపారు. అయితే డీలర్లు స్టాక్‌ను కావాలనే దాచిపెడుతున్నారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు.
మరోవైపు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ కూడా ధరల పెంపు జరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ర్యామ్, స్టోరేజ్ వంటి కీలక భాగాల ధరలు పెరగడం, ఏఐ రంగంలో చిప్‌లకు డిమాండ్ అధికంగా ఉండటంతో స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ మొత్తం ధరలను పెంచే దిశగా వెళుతోందని చెప్పారు. ఇప్పటికే జపాన్‌తో పాటు మరికొన్ని దేశాల్లో యాపిల్ ధరలు పెంచిన నేపథ్యంలో, భారత్‌లో కూడా త్వరలోన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.