Advertisement

నాలుగో రోజూ తప్పని నష్టాలు.. సెన్సెక్స్‌ 364 పాయింట్లు డౌన్‌

Sensex down 364 points as losses continue for fourth day
  • నిఫ్టీ 127 పాయింట్లు పతనం
  • 76,391.39 వద్ద బీఎస్‌ఈ , 23,869.60 వద్ద స్థిరపడ్డ ఎన్‌ఎస్‌ఈ
  • అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో పెరిగిన చమురు ధరలు
  • బ్యాంకింగ్‌, రియాల్టీ షేర్లపై అమ్మకాల ఒత్తిడి
  • స్వల్ప లాభాల్లో ముగిసిన ఆటో రంగ షేర్లు
అమెరికా-ఇరాన్ మధ్య తాజా ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం భారత స్టాక్‌ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో దేశీయ సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి.

గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 364 పాయింట్లు పడిపోయి 76,391.39 వద్ద ముగిసింది. నిఫ్టీ 127 పాయింట్లు కోల్పోయి 23,869.60 వద్ద స్థిరపడింది. నిఫ్టీ-50 సూచీలో ఎస్‌బీఐ లైఫ్‌, బజాజ్‌ ఆటో, ఎంఅండ్‌ఎం, టీసీఎస్‌, టాటా కన్జ్యూమర్స్‌ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, నెస్లే ఇండియా, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, అదానీ పోర్ట్స్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు నష్టపోయిన వాటిలో ఉన్నాయి. 

బ్యాంకింగ్‌, రియాల్టీ, చమురు సంబంధిత షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించింది. నిఫ్టీ రియాల్టీ సూచీ 1.81 శాతం క్షీణించగా, పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీ 1 శాతం, నిఫ్టీ బ్యాంక్‌ 0.94 శాతం చొప్పున పడిపోయాయి. కెమికల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు కూడా నష్టాల్లో ముగిశాయి. అయితే ఆటో రంగం కొంత మెరుగ్గా రాణించింది. నిఫ్టీ ఆటో సూచీ 0.70 శాతం లాభపడగా, మీడియా సూచీ కూడా స్వల్ప లాభాల్లో ముగిసింది.

పశ్చిమాసియాలోని భౌగోళిక ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు.. ద్రవ్యోల్బణం, కార్పొరేట్‌ లాభాలపై ప్రభావం చూపవచ్చనే ఆందోళనతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించినట్లు మార్కెట్‌ నిపుణులు తెలిపారు.
Advertisement
Sensex
Nifty 50
Indian Stock Market
Crude Oil Prices
US Iran Tensions
Share Market News

More Telugu News