దీపావళికి ప్రత్యేక రైళ్లు.. ఏపీ ప్రయాణికులకు స్పెషల్
- చెన్నై-భవనేశ్వర్, చెన్నై-సంత్రాగచ్చి మధ్య రైలు సర్వీసులు
- ఏపీలోనూ ఆగనున్న రైళ్లు
- గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస వాసులకు ఉపయోగం
చెన్నై సెంట్రల్-సంత్రాగచ్చి మధ్య కూడా ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. నవంబర్ 11, 18, 25 తేదీల్లో చెన్నై సెంట్రల్ నుంచి సంత్రాగచ్చి వరకూ స్పెషల్ సూపర్ ఫాస్ట్ (నెంబర్ 06071) ఏర్పాటు చేశారు. చెన్నై సెంట్రల్‌లో రాత్రి 11.45కి ఈ రైలు బయల్దేరి, మూడో రోజు తెల్లవారుజామున గం.3.45కి సంత్రాగచ్చికి చేరుకుంటుంది. ఈ నెల 13, 20, 27 తేదీల్లో సంత్రాగచ్చి నుంచి చెన్నై సెంట్రల్‌కి ప్రత్యేక సూపర్ ఫాస్ట్ రైలు (నెంబర్ 06072) నిర్వహించనున్నారు. సంత్రాగచ్చిలో తెల్లవారు జామున 5కి బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 11 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్దా రోడ్డు రైల్వేస్టేషన్‌లలో ఆగుతాయి.