తిరుపతిలో అఖిల్ ‘లెనిన్’ సందడి.. గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్
- తిరుపతిలో ఘనంగా అఖిల్ 'లెనిన్' మూవీ ప్రీ రిలీజ్ వేడుక
- ముఖ్య అతిథిగా హాజరైన తండ్రి, కింగ్ నాగార్జున
- భారీగా తరలివచ్చిన అక్కినేని అభిమానులు
- జూలై 10న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
ఈ వేడుకకు చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి అక్కినేని అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో తిరుపతి గ్రౌండ్స్ మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయింది. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నాగార్జున, అఖిల్‌ను ఒకే వేదికపై చూసి అభిమానులు కేరింతలతో హోరెత్తించారు.
మురళి కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో సాగే రొమాన్స్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన 'జయ మంగళం' పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా జూలై 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
