ఆ పడవ ప్రమాదంలో గల్లంతైన వారిలో 300 మందికిపైగా పాకిస్థానీలే!
- 700 మంది వలసదారులతో వెళ్తూ మధ్యధరా సముద్రంలో పడవ బోల్తా
- ఇప్పటి వరకు 79 మంది మృతదేహాల వెలికితీత
- ప్రమాదం బారినపడిన 298 మంది చిన్నారులు
- బాధిత కుటుంబాలకు పాక్ ప్రధాని సంతాపం
ప్రమాదంపై పాక్ ప్రధాని షేబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆచూకీ గల్లంతైన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పాకిస్థాన్ జాతీయుల అక్రమ రవాణాకు కారకుడిగా భావిస్తున్న వ్యక్తిని కరాచీ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. అజర్‌బైజన్‌కు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.