తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు
- శుక్రవారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
- సూర్యాపేట సహా పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం
- శుక్రవారం నుండి శనివారం వరకు పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు
శుక్రవారం నుండి శనివారం ఉదయం వరకు సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, మెదక్, నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల తదితర జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదిలాబాద్, కుమురం బీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నల్గొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. ఇక్కడ ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ కేంద్రం.