బాలకృష్ణ కాలి గోటికి కూడా కొడాలి నాని సరిపోడు: రావి వెంకటేశ్వరరావు
- హరికృష్ణ పేరు చెప్పుకుని లక్షలు దోచుకున్నారన్న రావి
- ఏ అర్హతతో ఎన్టీఆర్ కుటుంబం గురించి మాట్లాడుతున్నారని ప్రశ్న
- విజయసాయి ప్రతి దోపిడీలో కొడాలి నానికి వాటా ఉందని ఆరోపణ
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసే ప్రతి దోపిడీలో కొడాలి నానికి వాటా ఉందని రావి వెంకటేశ్వరరావు ఆరోపించారు. వెయ్యి కోట్ల అవినీతి సొమ్మును విశాఖలో పెట్టుబడిగా పెట్టారని అన్నారు. నాని పెట్టుబడులపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. కొడాలి నానికి చరమగీతం పాడేందుకు గుడివాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. దుర్మార్గుడైన నానిని నెహ్రూ సెంటర్ లో పాతేస్తానని చెప్పారు.