శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రథం లాగిన బాలకృష్హ అర్ధాంగి వసుంధర
- తిరుమల బ్రహ్మోత్సవాల్లో వైభవంగా స్వర్ణరథోత్సవం
- శ్రీదేవి, భూదేవి సమేతంగా విహరించిన మలయప్ప స్వామి
- రథం లాగి భక్తి చాటుకున్న బాలకృష్ణ అర్ధాంగి వసుంధర
- వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
- సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఫొటోలు
కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం ఉదయం స్వర్ణరథోత్సవం కనులపండువగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు సర్వాలంకార భూషితులై స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.
బంగారు వర్ణంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న రథంపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గోవింద నామస్మరణలతో తిరుమాడ వీధులు మార్మోగాయి. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకుని తన్మయత్వం చెందారు.
ఈ స్వర్ణరథోత్సవంలో ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అర్ధాంగి వసుంధర ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె స్వయంగా రథం తాడును పట్టుకుని లాగి స్వామివారిపై తనకున్న భక్తిని చాటుకున్నారు. ఈ వేడుకలో టీటీడీ బోర్డు సభ్యురాలు, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూడా పాల్గొన్నారు. వసుంధర రథాన్ని లాగుతున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.