Dharmana Prasad: ఉత్తరాంధ్ర అభివృద్ధి మీకు ఇష్టం లేదా?: అచ్చెన్నాయుడిని సూటిగా ప్రశ్నించిన మంత్రి ధర్మాన

Dharmana Prasad Rao fires on Atchannaidu
షార్ట్స్‌లో చూడండి
మంత్రి పదవి రాకముందు మౌనంగా ఉన్న ధర్మాన ప్రసాదరావు మంత్రి పదవి వచ్చాక మూడు రాజధానులు అంటూ మాట్లాడుతున్నాడని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శనాస్త్రాలు సంధించడం తెలిసిందే. దీనిపై మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు. అచ్చెన్నాయుడు శ్రీకాకుళానికి ఏం చేశారని నిలదీశారు. రియల్ ఎస్టేట్ కోసం అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటారా? ఉత్తరాంధ్ర అభివృద్ధి మీకు ఇష్టం లేదా? అంటూ అచ్చెన్నాయుడిని సూటిగా ప్రశ్నించారు. అమరావతిపై నిధులు ఖర్చు చేస్తే ఉత్తరాంధ్రకు మళ్లీ కష్టాలు తప్పవని ధర్మాన స్పష్టం చేశారు. 
Go Back to Shorts
Dharmana Prasad
Atchannaidu
Uttarandhra
Three Capitals
Srikakulam District
YSRCP
TDP

More Telugu News