రాత్రి నుంచి కొరటాల శివ ఆఫీసు ముందు ‘ఆచార్య’ ఎగ్జిబిటర్ల ధర్నా!
- తమకు వచ్చిన రూ. 15 కోట్ల నష్టంలో కొంత పూడ్చాలని డిమాండ్
- లేదంటే చిరంజీవి ఇంటి దగ్గర ధర్న చేస్తామని హెచ్చరిక
- చిరంజీవి, చరణ్ కలిసి నటించిన ఆచార్య
- కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా
‘ఆచార్య’ సినిమాతో భారీ నష్టాలు చవిచూసిన 25 మంది ఎగ్జిబిటర్లు కొరటాల ఆఫీసు ముందు నిన్న రాత్రి నుంచి బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. సినిమాను కొని తాము రూ. 15 కోట్ల వరకూ నష్టపోయామని ఆ లోటులో ఎంతో కొంత భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. లేదంటే చిరంజీవి ఇంటి దగ్గర ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నారని తెలుస్తోంది.
విడుదలకు ముందే ఈ చిత్రాన్ని నిర్మాతల దగ్గర నుంచి కొరటాల శివ తీసుకున్నారట. అందుకే బయ్యర్లు నష్టాన్ని కొరటాలనే భరించాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.