బొజ్జలను సర్‌ప్రైజ్ చేసిన చంద్రబాబు!
- నేడు మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బర్త్ డే
- బర్త్‌డే విషెస్ చెప్పేందుకు బొజ్జల ఇంటికి చంద్రబాబు
- స్వయంగా కేక్ కట్ చేయించిన వైనం
- ఆనందంలో తేలియాడిన బొజ్జల
ఇక నేడు (ఏప్రిల్ 15) బొజ్జల పుట్టిన రోజు. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు.. శుక్రవారం సాయంత్రం నేరుగా బొజ్జల ఇంటికి వెళ్లారు. సడెన్‌గా చంద్రబాబు తమ నివాసానికి రావడం చూసిన బొజ్జల కుటుంబ సభ్యులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. బొజ్జలకు బర్త్ డే విషెస్ చెప్పేందుకే తాను వచ్చానని చెప్పిన చంద్రబాబు.. కుర్చీకే పరిమితం అయిన బొజ్జలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అంతేకాకుండా కుటుంబ సభ్యుల సమక్షంలో బొజ్జలతో చంద్రబాబు కేక్ కట్ చేయించారు. ఆ తర్వాత కాసేపు బొజ్జల పక్కనే కూర్చుని మాట్లాడారు. తన ఇంటిలో చంద్రబాబును.. అదీ తనకు బర్త్ డే విషెస్ చెప్పడానికి వచ్చిన చంద్రబాబును చూసి బొజ్జల ఆనందంతో పొంగిపోయారు.