బిహార్‌లో బాలికపై లైంగిక దాడి కేసు.. నిందితుడిపై పోలీసుల ఎన్‌కౌంటర్‌

బిహార్‌లో బాలికపై లైంగిక దాడి కేసు.. నిందితుడిపై పోలీసుల ఎన్‌కౌంటర్‌

Bihar girl sexual assault case police encounter suspect
  • బిహార్‌లో పదో తరగతి బాలికపై దుండగుల లైంగిక దాడి
  • అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులపైకి కాల్పులు జరిపిన నిందితుడు నందన్‌
  • దీంతో ఎదురుకాల్పులు జరిపిన పోలీసులు
  • గాయపడిన నందన్‌ను ఆస్పత్రికి తరలింపు
  • కేసులో ఇప్పటివరకు ఐదుగురి అరెస్టు
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన బిహార్‌లో బాలికపై లైంగిక దాడి ఘటనలో కీలక నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. జముయ్‌లో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే. అతణ్ని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిందితుడు నందన్‌ యాదవ్‌ ప్రయత్నించాడని అధికారులు తెలిపారు. పోలీసులపై కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిపినట్లు చెప్పారు. గాయపడిన నందన్‌ను ఆస్పత్రికి తరలించారు.

ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు మైనర్లుగా తేల్చారు. ఘటనలో పాల్గొన్న వారందరినీ గుర్తిస్తున్నామని బిహార్‌ ఉప ముఖ్యమంత్రి విజయ్‌ కుమార్‌ చౌదరి చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పోలీసులు వేగంగా చర్యలు తీసుకున్నారని మంత్రి శ్రవణ్‌ కుమార్‌ తెలిపారు. ఈ ఘటన చాలా బాధాకరమని అన్నారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

సెప్టెంబర్‌ 19న ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. కోచింగ్‌ నుంచి ఇంటికి వెళుతున్న పదో తరగతి విద్యార్థిని, ఆమె స్నేహితుడిని కొందరు యువకులు అడ్డుకున్నారు. బాలుడిపై దాడి చేశారు. బాలికను అతడి నుంచి వేరు చేసేందుకు ప్రయత్నించారు.

వీడియోలో నందన్‌ యాదవ్‌ బాలికను మెడ పట్టుకుని కొంత దూరం తీసుకెళ్లినట్లు కనిపించింది. అసభ్యంగా తాకుతూ రాక్షసానందం పొందడం వీడియోల్లో కనిపించింది. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించింది. బాలుడు అక్కడికి రావడంతో ఆమెను కిందకు దించాడు. ఆ తర్వాత బాలికను చేతితో నెట్టాడు. బాలుడు ఆమెకు అడ్డుగా నిలిచి రక్షించే ప్రయత్నం చేశాడు.
Advertisement
Nandan Yadav
Bihar Police Encounter
Jamui Sexual Assault Case
Bihar Crime News
Vijay Kumar Chaudhary
Women Safety Bihar

More Telugu News