పాక్ క్రికెట్‌లో ముదురుతున్న వివాదం.. రిజ్వాన్ నోరు నొక్కిన పీసీబీ
- ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న రిజ్వాన్
- బహిరంగంగా మాట్లాడకుండా రిజ్వాన్‌పై పీసీబీ ఆంక్షలు
- వివరణ ఇచ్చేందుకు అనుమతి కోరగా రెండుసార్లు తిరస్కరణ
- విచారణపై స్పష్టత కోరుతూ ఐసీసీ, ఎన్‌సీసీఐఏకు లేఖలు రాసిన రిజ్వాన్
- రిజ్వాన్ మొబైల్ ఫోన్‌ను ఇంకా తిరిగి ఇవ్వని పీసీబీ భద్రతా బృందం
పాకిస్థాన్ క్రికెట్‌లో సీనియర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌పై జరుగుతున్న విచారణ వ్యవహారం మరో కీలక మలుపు తీసుకుంది. తనపై వచ్చిన అవినీతి, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ ఆరోపణలపై బహిరంగంగా మాట్లాడకుండా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అతనిపై ఆంక్షలు విధించింది. ఈ వివాదంపై తన వాదనను ప్రజల ముందు ఉంచేందుకు రిజ్వాన్ చేసిన ప్రయత్నాలను పీసీబీ అడ్డుకోవడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇటీవలే ఇంగ్లండ్ పర్యటన నుంచి అర్ధాంతరంగా స్వదేశానికి పంపిన ఏడుగురు ఆటగాళ్లలో రిజ్వాన్, ఇమామ్-ఉల్-హక్ కూడా ఉన్నారు. 'ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్', అవినీతి ఆరోపణల నేపథ్యంలో పాకిస్థాన్ నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌సీసీఐఏ) వీరిని విచారిస్తోంది. ఇందులో భాగంగా వారిని సుమారు రెండు గంటల పాటు ప్రశ్నించడమే కాకుండా వారి మొబైల్ ఫోన్లను కూడా పీసీబీ భద్రతా బృందం స్వాధీనం చేసుకుంది.
పాకిస్థాన్‌కు చెందిన 'జియో న్యూస్' కథనం ప్రకారం.. ఈ మొత్తం వివాదంపై బహిరంగంగా వివరణ ఇచ్చేందుకు రిజ్వాన్ రెండుసార్లు పీసీబీ అనుమతి కోరాడు. తనపై వచ్చిన ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలని భావించాడు. అయితే, సెంట్రల్ కాంట్రాక్ట్‌లోని క్లాజ్ 4.1 ప్రకారం బోర్డు అనుమతి తప్పనిసరి కావడంతో అతడు అభ్యర్థించాడు. కానీ, పీసీబీ అతని విజ్ఞప్తులను రెండుసార్లూ తిరస్కరించింది. పీసీబీని నిందించే ఉద్దేశం తనకు లేదని, కేవలం తన వాదనను మాత్రమే వినిపించాలనుకున్నట్లు రిజ్వాన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఈ క్రమంలోనే ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్‌కు కూడా రిజ్వాన్ ఒక లేఖ రాశాడు. విచారణ ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని కోరాడు. మరోవైపు ఎన్‌సీసీఐఏకు కూడా అతడు ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. "ఈ కేసులో ఎన్‌సీసీఐఏ ఎందుకు విచారణ జరుపుతుందో అర్థం కావడం లేదు. నాపై ఉన్న ఆరోపణల పూర్తి వివరాలు అందిస్తేనే విచారణకు సహకరించగలను" అని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఇప్పటికీ రిజ్వాన్ మొబైల్ ఫోన్‌ను తిరిగి ఇవ్వలేదని, ఫోన్‌లోని లావాదేవీలపై పీసీబీ లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.