మోదీ, చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు దిష్టి తీసిన కోటంరెడ్డి

మోదీ, చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు దిష్టి తీసిన కోటంరెడ్డి

Kotamreddy performs dishti for portraits of Modi Chandrababu and Pawan
  • నెల్లూరు అభివృద్ధి పనుల కోసం రూ. 240 కోట్ల నిధుల విడుదల
  • వైసీపీ నేతల దిష్టి తమ నేతలకు తగలకుండా దిష్టి తీశామన్న కోటంరెడ్డి
  • కొర్పొరేషన్ ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేయాలని శ్రేణులకు పిలుపు

నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 240 కోట్ల భారీ నిధులను మంజూరు చేయడంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో కూటమి నాయకులు, కార్యకర్తలు వినూత్న రీతిలో వేడుకలు నిర్వహించారు. ఈ నిధుల కేటాయింపుకు సహకరించిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, పొంగూరు నారాయణల చిత్రపటాలకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దిష్టి తీశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగ కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతుంటే, ప్రతిపక్ష వైసీపీ వేస్తున్న శని దిష్టి, శాపనార్థాలు తమ నేతలకు తగలకుండా ఉండేందుకే ఈ దిష్టి తీసే కార్యక్రమం చేపట్టామని ఆయన వ్యాఖ్యానించారు.


త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల గురించి కోటంరెడ్డి మాట్లాడుతూ... నెల్లూరు కార్పొరేషన్‌లోని 72 డివిజన్లలో కూటమి క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిని కనీసం లక్ష ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించి మంత్రి నారాయణకు బహుమతిగా అందించాలని కోరారు. ఈ ఎన్నికల్లో 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న ‘జెన్ జీ’ యువతకు ప్రాధాన్యతనిచ్చి పోటీ చేసే అవకాశం కల్పిస్తామని, పార్టీ టికెట్ ఖరారైన తర్వాత అంతర్గత విభేదాలు మరచి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా విజయం కోసం శ్రమించాలని పిలుపునిచ్చారు.

Advertisement
Kotamreddy Sridhar Reddy
Chandrababu Naidu
Pawan Kalyan
Nellore Development Funds
Andhra Pradesh Local Body Elections
Nellore City Corporation

More Telugu News