చెయ్యేస్తే గమ్మునుండేందుకు మేము గాంధీలం కాదు: బీద రవిచంద్ర
- ఏపీ శాసనమండలిలో నిన్న ఉద్రిక్తత
- మంత్రులు దాడి చేసేందుకు వచ్చారన్న బీద రవిచంద్ర
- మండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేశామని వెల్లడి
శాసనమండలిలో జరిగిన ఘర్షణకు సంబంధించిన ఫుటేజీని బయటపెట్టాలని రవిచంద్ర డిమాండ్ చేశారు. ఫుటేజ్ బయట పెడితే ఎవరు ఏం చేశారో అందరికీ తెలుస్తుందని చెప్పారు. మండలిలో ఘర్షణకు మంత్రుల తీరే కారణమని అన్నారు. విపక్ష సభ్యులను మంత్రులు బూతులు తిట్టారని... లోకేశ్ పై దాడి చేసేందుకు వచ్చారని... వారిపై మండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. మండలిలో జరిగిన ఘటనలు ఎవరికీ గౌరవం కలిగించేవి కాదని అన్నారు.