జూన్ 13 వరకు ‘వందే భారత్ మిషన్ 2’ పొడిగింపు
- నేటితో ముగియనున్న రెండో విడత
- జూన్ 13 తర్వాత మూడో దశ కూడా ఉంటుందన్న ప్రభుత్వం
- ఇప్పటి వరకు 23,475 మంది రాక
ఇప్పటి వరకు 98 దేశాల నుంచి 2.59 లక్షల మంది భారతీయులు వెనక్కి వచ్చేందుకు నమోదు చేసుకున్నట్టు పేర్కొన్నారు. వీరిలో 23,475 మంది ఇప్పటికే భారత్ చేరుకున్నట్టు చెప్పారు. కాగా, పొడిగించిన రెండో విడతలో 47 దేశాల్లోని భారతీయులను 162 విమానాల ద్వారా వెనక్కి తీసుకురానున్నట్టు అనురాగ్ వివరించారు.