ఏపీ శాసనమండలి రద్దు నిర్ణయం... నిమిషాల్లో ముగిసిన జగన్ క్యాబినెట్ సమావేశం!
- జగన్ నేతృత్వంలో సమావేశమైన క్యాబినెట్
- మండలి రద్దు అంశాన్ని ప్రతిపాదించిన పిల్లి సుభాష్ చంద్రబోస్
- ఒకరిద్దరు అభ్యంతరం చెప్పినా, రద్దుకే మొగ్గు
మరో ఏడాదిలో ఎలాగైనా మండలిలో బలం పెరుగుతుందని, పదవులు లేని పార్టీ నేతలకు స్థానం కల్పించవచ్చని, వారు చెప్పగా, అప్పటికే రద్దుపై ఓ నిర్ణయానికి వచ్చేసిన సీఎం, బిల్లులను అడ్డుకునే సభలు ఎందుకని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దీంతో మంత్రులంతా ఆయన నిర్ణయానికి ఆమోదం పలికారు. మరికాసేపట్లో అసెంబ్లీలో మండలి రద్దుపై చర్చ సాగనుంది.