క్రెడిట్ కొట్టేసేందుకే స్టంట్లు.. కూటమి ప్రభుత్వంపై జగన్ ఆరోపణలు
- సాగునీటి ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వాన్ని విమర్శించిన జగన్
- పాత ప్రాజెక్టులకు క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపణ
- పురుషోత్తపట్నం నీటిని పోలవరం నీళ్లుగా చూపిస్తున్నారన్న జగన్
- వైఎస్సార్ హయాంలోనే 79 శాతం కాలువ పనులు పూర్తయ్యాయని వెల్లడి
- ప్రజాధనంతో ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్లు చేస్తోందని విమర్శ
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం కొత్తగా పనులేమీ చేపట్టకుండా, కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమవుతోందని విమర్శించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ఆయన స్పందించారు.
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తూ, వాటిని పోలవరం ప్రాజెక్టు జలాలుగా చూపిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకుంటున్నారని జగన్ విమర్శించారు. పురుషోత్తపట్నం పంపులు కానీ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ కానీ ప్రస్తుత ప్రభుత్వం నిర్మించినవి కావని ఆయన స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పోలవరం ఎడమ కాలువకు సంబంధించి 79 శాతం పనులు పూర్తయ్యాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
క్షేత్రస్థాయిలో కొత్తగా ఎటువంటి పనులు చేపట్టకుండా, గతంలో పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా లబ్ధి పొందాలని ప్రభుత్వం ఆరాటపడుతోందని జగన్ ఆక్షేపించారు. ప్రజాధనంతో ప్రాజెక్టుల వద్ద ప్రచార కార్యక్రమాలు, పబ్లిసిటీ స్టంట్లు నిర్వహించడం అత్యంత దారుణమని ఆయన పేర్కొన్నారు.