నాకు మరణశిక్ష విధించండి: కోర్టును కోరిన యాసిన్ మాలిక్

Yasin Malik requests court to sentence him to death in Sarla Bhat case
  • కాశ్మీరీ పండిట్ మహిళ హత్య కేసులో ప్రమేయం లేదన్న యాసిన్ మాలిక్
  • కేసును వాదించబోనని, తనకు మరణశిక్ష విధించాలని కోర్టుకు విజ్ఞప్తి
  • హత్య జరిగినప్పుడు తాను కోమాలో ఉన్నానని వాదన
  • ఇది రాజకీయ ప్రేరేపిత కట్టుకథ అని ఆరోపణ
నిషేధిత జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) అధినేత యాసిన్ మాలిక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 1990లో జరిగిన కశ్మీరీ పండిట్ సర్లా భట్ హత్య కేసులో తనకు ఎటువంటి ప్రమేయం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో తాను న్యాయపోరాటం చేయదలుచుకోలేదని, తనపై మోపిన ఆరోపణల నేపథ్యంలో తనకు మరణశిక్ష విధించాలని కోరుతూ శ్రీనగర్‌లోని ప్రత్యేక కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రస్తుతం యాసిన్ మాలిక్ ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

ఈ అఫిడవిట్‌లో తన భార్యతో వైవాహిక బంధాన్ని కూడా ముగిస్తున్నట్లు మాలిక్ ప్రకటించడం గమనార్హం. 1990 ఏప్రిల్‌లో సర్లా భట్‌ హత్యకు గురికాగా, ఈ దర్యాప్తులో భాగంగా దర్యాప్తు సంస్థ ఈ ఏడాది జూన్‌లో యాసిన్ మాలిక్‌ పేరును నిందితుడిగా చేర్చుతూ చార్జ్‌షీట్ దాఖలు చేసింది.

అయితే, ఈ ఆరోపణలను యాసిన్ మాలిక్ పూర్తిగా ఖండించారు. హత్య జరిగిన సమయంలో తాను ఒక భవనంపై నుంచి పడిపోయి కోమాలో ఉన్నానని, అటువంటి స్థితిలో హత్యకు ప్రణాళిక రచించడం అసాధ్యమని తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. గతంలో ఈ కేసులో తన పేరు ఎక్కడా లేదని, ఇప్పుడు రాజకీయ ప్రేరేపితంగా కట్టుకథలు సృష్టించి తనను ఇరికించారని ఆరోపించారు.
Advertisement
Yasin Malik
JKLF
Sarla Bhat Murder Case
Jammu and Kashmir
Death Sentence
Tihar Jail

More Telugu News