రామ మందిర ట్రస్టుకు కొత్త సీఈవో... స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ
- రామ మందిర నిధుల చోరీపై సిట్ నివేదికను బయటపెట్టాలని డిమాండ్
- ప్రజల భక్తిని అపహాస్యం చేసి కోట్లు దోచుకున్నారని విమర్శ
- తెలంగాణ ఓటర్ల జాబితా సవరణలపై ప్రజలకు కీలక సూచనలు
- ఓటర్లను చనిపోయినట్లు తప్పుగా చూపిస్తున్నారని ఆరోపణ
అయోధ్య రామ మందిర నిర్మాణానికి అందిన విరాళాల్లో జరిగిన అవకతవకలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇచ్చిన నివేదికను ఎందుకు బహిర్గతం చేయడం లేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రజల విశ్వాసాన్ని అపహాస్యం చేయడంతో వారు ఆగ్రహంగా ఉన్నారని ఆయన అన్నారు.
గురువారం హైదరాబాద్‌లో ఒవైసీ మీడియాతో మాట్లాడారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను నియమించడంపై ఒవైసీ స్పందించారు. "గతంలో చేసిన నియామకాలు ఎవరు చేశారు? ప్రభుత్వమే కదా? పార్లమెంటులో బిల్లు పెట్టి ట్రస్టును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కూడా కోట్లాది రూపాయల దొంగతనం జరిగింది. ఇప్పుడు ఎవరిని నియమించుకున్నా అది ప్రభుత్వ ఇష్టమే. కానీ, ఆ దొంగతనం ఎవరు చేశారో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు" అని అన్నారు.
ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదై, నివేదిక కూడా సిద్ధంగా ఉన్నప్పుడు దానిని ఎందుకు బయటపెట్టడం లేదని ఆయన నిలదీశారు. నమ్మకం పేరుతో ఓట్లు, అధికారం సంపాదించి కొందరు అందినకాడికి దోచుకున్నారని ఆరోపించారు.
ఓటర్ల జాబితాపై సూచనలు
తెలంగాణలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలోనూ అవకతవకలు జరుగుతున్నాయని ఒవైసీ అన్నారు. మ్యాపింగ్‌లో తేడాలు, ఒకే కుటుంబంలో ఆరుగురికి పైగా ఓటర్లు ఉన్న సందర్భాల్లో నోటీసులు జారీ చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి నోటీసులు అందుకున్న వారు వెంటనే విచారణకు హాజరై ఆధార్ కార్డు, ఇతర పత్రాలను సమర్పించాలని సూచించారు. కొందరు ఓటర్లు బతికి ఉన్నా, తమ చిరునామాలోనే నివసిస్తున్నా, చనిపోయినట్లుగా లేదా వేరే ప్రాంతానికి మారినట్లుగా తప్పుగా నమోదు చేస్తున్నారని ఫిర్యాదులను ప్రస్తావించారు.