లోక్ భవన్‌కు సీఎం రేవంత్.. కొండా సురేఖ బర్తరఫ్‌కు గవర్నర్ ఆమోదం

CM Revanth Reddy visits Lok Bhavan Governor approves Konda Surekha dismissal
  • లోక్‌భవన్‌కు సీఎం రేవంత్ రెడ్డి
  • గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ
  • కొండా సురేఖ బర్తరఫ్‌కు గవర్నర్ ఆమోదం
  • బర్తరఫ్ ఉత్తర్వులపై గవర్నర్ సంతకం
  • కేబినెట్‌లో మూడు మంత్రి పదవులు ఖాళీ
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి లోక్‌భవన్‌కు చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ కూడా వెళ్లారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో సీఎం, మంత్రులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

ముఖ్యంగా కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించే అంశంపై గవర్నర్‌తో సీఎం చర్చించినట్లు సమాచారం. ఆమె బర్తరఫ్‌కు దారితీసిన పరిస్థితులను రేవంత్ రెడ్డి గవర్నర్‌కు వివరించారు. అనంతరం బర్తరఫ్‌కు గవర్నర్ ఆమోదం తెలిపారు. సీఎం ఎదురుగానే గవర్నర్ బర్తరఫ్ ఉత్తర్వులపై సంతకం చేసినట్లు తెలిసింది.

దీంతో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ లోక్‌భవన్‌ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

కొండా సురేఖ బర్తరఫ్‌తో తెలంగాణ కేబినెట్‌లో మూడు మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. ఈ ఖాళీలను ఎవరితో భర్తీ చేయాలన్న అంశంపైనే తాజా భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా కొండా సురేఖ స్థానంలో ఎవరిని తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

గతంలో కాంగ్రెస్‌ సీనియర్ నేత మహేశ్ కుమార్ గౌడ్‌కు మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరిగింది. మరోవైపు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ మొదలైంది. లేకపోతే కొత్త ముఖాలను కేబినెట్‌లోకి తీసుకొస్తారా అన్నది కూడా ఆసక్తిగా మారింది.
Advertisement
Revanth Reddy
Konda Surekha
Telangana Cabinet Dismissal
Governor Shiv Pratap Shukla
Telangana Politics
Lok Bhavan

More Telugu News