పీఎఫ్ వివాదాలపై కేంద్రం కీలక నిర్ణయం.. డిసెంబర్ 28 తర్వాత ఛాన్స్ ఉండదు!
- డిసెంబర్ 28 వరకు అందుబాటులో ‘విశ్వాస్ 2026’ పథకం
- గడువు తర్వాత పొడిగింపు ఉండదని ప్రభుత్వం స్పష్టీకరణ
- పీఎఫ్ ఆలస్యపు పెనాల్టీలను పథకంలో భారీగా తగ్గింపు
- కోర్టు, ట్రైబ్యునల్‌లో ఉన్న కేసులకూ పథకం వర్తింపు
- పెనాల్టీ నోటీసు రాని ఆలస్యపు కేసులకూ అవకాశం
ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్)కు సంబంధించిన పాత వివాదాల పరిష్కారానికి కేంద్రం తీసుకొచ్చిన ‘విశ్వాస్ 2026’ పథకం గడువును పొడిగించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం కింద 2026 డిసెంబర్ 28లోపు దరఖాస్తు చేసుకోవాలని యజమానులకు సూచించింది.
పీఎఫ్ ఆలస్యంగా జమ చేసిన సందర్భాల్లో సాధారణ నిబంధనల ప్రకారం ఏడాదికి 37 శాతం వరకు పెనాల్టీ పడే అవకాశం ఉంది. అయితే ‘విశ్వాస్ 2026’లో ఈ భారాన్ని భారీగా తగ్గించారు. రెండు నెలల వరకు ఆలస్యమైతే నెలకు 0.25 శాతం, రెండు నుంచి నాలుగు నెలల ఆలస్యానికి నెలకు 0.50 శాతం, నాలుగు నెలలు దాటితే నెలకు 1 శాతం చొప్పున పెనాల్టీ చెల్లించే అవకాశం కల్పించారు.
ఇప్పటికే పెనాల్టీకి సంబంధించిన కేసులు కోర్టు లేదా ట్రైబ్యునల్‌లో ఉన్నా ఈ పథకం వర్తిస్తుంది. ఈపీఎఫ్‌ఓ పెనాల్టీ ఆదేశాలు జారీ చేసి, మొత్తం లేదా కొంత మొత్తం ఇంకా వసూలు చేయకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చు. పెనాల్టీ విధించాలంటూ నోటీసు ఇచ్చి తుది ఆదేశాలు జారీ చేయని కేసులు కూడా పథకం పరిధిలోకి వస్తాయి.
పీఎఫ్ చెల్లింపుల్లో ఆలస్యం నమోదై ఉన్నా ఇప్పటివరకు పెనాల్టీ నోటీసు ఇవ్వని కేసులకు కూడా ఈ అవకాశం ఉంది. ఇప్పటికే ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని కొన్ని న్యాయస్థానాలు ఆదేశించాయి. పుణె బెంచ్ బాంబే హైకోర్టు ఓ కేసులో యజమాని రెండు వారాల్లో ‘విశ్వాస్ 2026’ కింద దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. మద్రాస్ హైకోర్టు కూడా పథకాన్ని ఉపయోగించుకునేందుకు యజమాని అంగీకరించడంతో కేసును ముగించింది. కేరళ హైకోర్టు ఎర్నాకుళం బెంచ్ 19 కేసుల్లో ఇలాంటి ఆదేశాలు ఇచ్చింది.