కొండా సురేఖ అంశంపై అక్కడి నుంచే నిర్ణయం: మల్లు రవి
- ఏఐసీసీ నుంచి తుది నిర్ణయం వచ్చిందన్న మల్లు రవి
- అధిష్ఠానం నిర్ణయం ప్రకారమే మంత్రి పదవి నుంచి తొలగించినట్లు వెల్లడి
- ప్రణాళికా సంఘం ఛైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగించారన్న మల్లు రవి
తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి స్పందించారు. పార్టీ నిర్దేశించిన లక్ష్మణ రేఖను దాటితే ఎంతటి వారిపై అయినా కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కొండా సురేఖ, చిన్నారెడ్డిల విషయంలో ఏఐసీసీ నుంచి తుది నిర్ణయం వెలువడిందని, అధిష్ఠానం ఆదేశాల మేరకే సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించినట్లు వెల్లడించారు.
కొండా సురేఖ, చిన్నారెడ్డిలకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా ఆరా తీసి అధిష్ఠానానికి నివేదిక సమర్పించినట్లు మల్లు రవి తెలిపారు. ఆ నివేదిక ఆధారంగానే అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. చిన్నారెడ్డిని సైతం తెలంగాణ ప్రణాళికా సంఘం ఛైర్మన్ పదవి నుంచి తొలగించినట్లు స్పష్టం చేశారు.