నేటితో తేలిపోనున్న మండలి భవితవ్యం... కీలక నిర్ణయం తీసుకోనున్న జగన్!
- జగన్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ
- మండలి రద్దుపైనే ప్రధాన చర్చ
- ఇప్పటికే రద్దుపై స్పష్టమైన సంకేతాలు
అయితే, నేటి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారాదని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షం లేకుండానే మండలి రద్దుపై అసెంబ్లీలో చర్చ కొనసాగనుంది. కాగా, ఆశించిన స్థాయిలో తెలుగుదేశం నుంచి ఎమ్మెల్సీల చేరికలు ఉంటే, మండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవచ్చని ఓ మంత్రి వ్యాఖ్యానించినట్టు సమాచారం. అయితే, మండలి రద్దుకే మొగ్గు చూపుతున్నట్టు జగన్ ఇప్పటికే సంకేతాలిచ్చారు.