ఇదే వరద నాలుగు రోజులు... కోరుకుంటున్న రాయలసీమ!
- శరవేగంగా నిండుతున్న శ్రీశైలం
- మూడు రోజుల నీరు వస్తే రాయలసీమకు నీరు
- మరింత వరదవస్తే నాగార్జున సాగర్ కూ నీరు
ప్రస్తుతం శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాల ద్వారా 50 వేల క్యూసెక్కులకు పైగా నీటిని నాగార్జున సాగర్ డ్యామ్ కు విడుదల చేస్తుండటంతో, క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేయాలంటే మరింత సమయం పట్టవచ్చు. ఇదే సమయంలో మూడు రోజుల వరద నీరు వస్తే సుమారు 180 టీఎంసీలకు పైగా నీరు చేరుతుంది. అప్పుడు జలాశయంలో ఉన్న అన్ని కాలువలు, ఎత్తిపోతల పథకాల నుంచి నీటిని విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.