'అమ్మఒడి'తో జగన్ వెన్నుపోటు.. 'తల్లికి వందనం'తో వెలుగులు: కాలవ శ్రీనివాసులు
- తల్లికి వందనం పథకం కింద రెండో ఏడాది నిధులు విడుదల
- 67.47 లక్షల మంది విద్యార్థులకు రూ.10,120 కోట్లు జమ చేశామన్న కాలవ
- ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఈ పథకం వర్తిస్తుందని వెల్లడి
- అమ్మఒడితో జగన్ 25 లక్షల మంది విద్యార్థులను మోసం చేశారని ఆరోపణ
- ఈ పథకంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే అధిక ప్రయోజనమని వ్యాఖ్య
బడుగు, బలహీన వర్గాల పిల్లల ఉన్నత చదువులకు భరోసా ఇస్తూ, కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం రెండో ఏడాది నిధులను విజయవంతంగా జమ చేసిందని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఈరోజు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 67.47 లక్షల మంది విద్యార్థుల చదువుల కోసం రూ.10,120 కోట్లను నేరుగా 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఎలాంటి అవినీతికి తావులేకుండా ఈ ప్రక్రియ పూర్తిచేశామన్నారు.
ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా వర్తింపు
గత ప్రభుత్వంలో ఒక ఇంట్లో ఒక్కరికి మాత్రమే పథకం వర్తించేదని, దానివల్ల ఇద్దరు, ముగ్గురు పిల్లలున్న నిరుపేద కుటుంబాలు ఇబ్బంది పడ్డాయని కాలవ శ్రీనివాసులు గుర్తుచేశారు. కానీ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికీ 'తల్లికి వందనం' పథకాన్ని వర్తింపజేస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నామని అన్నారు. దీనికి తోడుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద మనసుతో అదనంగా 17,000 మంది అంగన్‌వాడీల పిల్లలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేశారని తెలిపారు.
జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
గత వైసీపీ ప్రభుత్వంపై కాలవ శ్రీనివాసులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 2019 ఎన్నికల సమయంలో ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ అమ్మఒడి ఇస్తామని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక మాట తప్పారని ఆరోపించారు. కేవలం 42 లక్షల మందికే పథకాన్ని పరిమితం చేసి, దాదాపు 25 లక్షల మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాలనలో కేవలం నాలుగుసార్లు మాత్రమే నిధులు ఇచ్చారని, అప్పట్లో బటన్లు నొక్కడం తప్ప లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాలేదని విమర్శించారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే అధిక ప్రయోజనం
ఈ పథకం ద్వారా అత్యధికంగా లబ్ధి పొందుతున్నది బడుగు, బలహీన వర్గాల వారేనని కాలవ గణాంకాలతో సహా వివరించారు. లబ్ధిదారులలో 34.89 లక్షల మంది బీసీ విద్యార్థులు, 13.85 లక్షల మంది ఎస్సీలు, 5,010 మంది ఎస్టీలు, 78,928 మంది మైనార్టీ విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం ఏ గ్రామానికి వెళ్లినా, తమ పిల్లలందరికీ తల్లికి వందనం డబ్బులు అందాయని తల్లులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. పేద కుటుంబాల్లో విద్యా వెలుగులు నింపుతున్న సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌లకు పేద కుటుంబాల తరఫున ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.