Advertisement

తిరుమలలో 7వ మైలు వద్ద ఆంజనేయస్వామి విగ్రహం చోరీ

Anjaneya Swamy statue stolen at 7th mile in Tirumala
  • విగ్రహాన్ని తీసుకెళ్లిన కాషాయ దుస్తులు ధరించిన వ్యక్తి
  • సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు
  • తీవ్ర ఆవేదనకు గురవుతున్న భక్తులు

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో అత్యంత షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద భక్తుల నిత్య పూజలందుకునే ప్రాచీన ఆంజనేయస్వామి విగ్రహం మాయమైంది. నిత్యం వందలాది మంది భక్తులు ఆగి స్వామివారిని దర్శించుకునే ఈ ప్రాంతంలో విగ్రహం కనిపించకపోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.


ఈ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు చోరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా... కాషాయ దుస్తులు ధరించిన ఒక వ్యక్తి అత్యంత చాకచక్యంగా విగ్రహాన్ని ఒక కాషాయ గుడ్డలో చుట్టి, ఎవరికీ అనుమానం రాకుండా తీసుకెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి.


ఈ ఘటనపై తిరుమల శ్రీవారి భక్తులు తీవ్ర దిగ్భ్రాంతి, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విగ్రహం ఉండాల్సిన స్థలంలో అది లేకపోవడంతో, ఘాట్ రోడ్డు గుండా వెళ్లే భక్తులు విగ్రహం ఉన్న వేదిక వద్దే బొట్టు పెట్టుకుని, నమస్కరించుకుని ఆవేదనతో వెళ్లిపోతున్నారు.


ఆలయ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని, విగ్రహాన్ని తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు? అతను ఘాట్ రోడ్డు నుంచి ఎటువైపు వెళ్లాడు? అనే కోణంలో తీవ్రంగా దర్యాప్తు జరుపుతున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుని విగ్రహాన్ని పునరుద్ధరిస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement
Anjaneya Swamy
Tirumala
Statue Theft
Tirumala Ghat Road
CCTV Footage
Tirupati Police

More Telugu News