Advertisement

చిప్‌ల ధరలు పెంచనున్న టీఎస్‌ఎంసీ.. స్మార్ట్‌ఫోన్లు మరింత ఖరీదు?

TSMC plans 10 percent hike in semiconductor manufacturing costs
  • చిప్‌ ధరలను 10 శాతం వరకు పెంచే అవకాశం
  • ముడి పదార్థాల ధరలు, తయారీ పరికరాల వ్యయం పెరగడమే కారణం
  • ప్రధాన ఖాతాదారులతో ఇప్పటికే చర్చించిన టీఎస్‌ఎంసీ
  • యాపిల్‌, ఎన్వీడియా, క్వాల్‌కామ్‌ వంటి దిగ్గజ సంస్థలకు చిప్‌లు తయారు చేస్తున్న సంస్థ
  • స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వేరబుల్స్ ధరలపై ప్రభావం పడే ఛాన్స్‌
ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ తయారీ సంస్థ టీఎస్‌ఎంసీ వచ్చే ఏడాది నుంచి చిప్ తయారీ ధరలను 10 శాతం వరకు పెంచాలని యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ముడి పదార్థాల ధరలు, తయారీ పరికరాల వ్యయం, విదేశాల్లో కొత్త ఫ్యాక్టరీల నిర్మాణ ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

నివేదికల ప్రకారం ఇప్పటికే ప్రధాన ఖాతాదారులతో టీఎస్‌ఎంసీ ధరల పెంపుపై చర్చలు జరిపింది. 28 నానోమీటర్, 16 నానోమీటర్, 12 నానోమీటర్ చిప్‌ల తయారీతో పాటు 6 నానోమీటర్ టెక్నాలజీపై తయారయ్యే చిప్‌ల ధరలు కూడా 2027 నుంచి 10 శాతం వరకు పెరగొచ్చని సమాచారం.

ప్రస్తుతం యాపిల్, ఎన్విడియా, క్వాల్‌కామ్, మీడియాటెక్, బ్రాడ్‌కామ్, ఇంటెల్ వంటి దిగ్గజ కంపెనీలకు  టీఎస్‌ఎంసీ చిప్‌లను తయారు చేస్తోంది. దీంతో ఈ సంస్థల భవిష్యత్ ఉత్పత్తుల తయారీ వ్యయం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వేరబుల్స్ ధరలపై దీని ప్రభావం పడొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఏఐ చిప్‌లు, డేటా సెంటర్ హార్డ్‌వేర్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే మెమరీ చిప్‌ల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఈ ప్రభావంతో అనేక స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఇటీవల తమ ఫోన్ల ధరలను పెంచాయి. భారత్‌లోనూ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు తగ్గడానికి పెరిగిన మెమరీ ధరలు, వినియోగదారుల డిమాండ్ బలహీనపడటం ప్రధాన కారణాలుగా మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
Advertisement
TSMC
Chip price hike
Semiconductor manufacturing
Smartphone prices
Apple Nvidia Qualcomm
AI chip demand

More Telugu News