తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్

Alert for Tirumala Srivari devotees
  • తిరుపతిలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ
  • నాలుగో వారం కూడా సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత
  • గురువారం దర్శనానికి ఇవ్వాల్సిన టోకెన్లను రద్దు చేసిన టీటీడీ
  • శుక్రవారం దర్శనానికి గురువారం నుంచి యథావిధిగా టోకెన్లు
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా నాలుగో వారం కూడా సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం జారీ చేయాల్సిన గురువారం నాటి దర్శన టోకెన్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

తిరుపతిలోని మూడు కేంద్రాల్లో బుధవారం ఇవ్వాల్సిన టోకెన్ల జారీని రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, శుక్రవారం దర్శనం కోసం గురువారం మధ్యాహ్నం నుంచి టోకెన్లను యథావిధిగా జారీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

బుధవారం దర్శనం కోసం కేటాయించిన 10,000 సర్వదర్శనం టోకెన్లు, మెట్ల మార్గం ద్వారా వచ్చే భక్తుల కోసం కేటాయించిన 2,000 టోకెన్ల కోటా మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకే ముగిసింది. దీంతో టోకెన్లు లభించని వేలాది మంది భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండి, తీవ్ర నిరాశతో తిరుమలకు బయలుదేరారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.                                
Advertisement
TTD
Tirumala
SSD tokens
Tirupati
Sarva Darshan
Tirumala rush

More Telugu News