టీమిండియా యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. 15 ఏళ్ల వయసులోనే ఎలాంటి భయం లేకుండా అతడు ఆడుతున్న తీరు అద్భుతమని కొనియాడాడు. తన కెరీర్‌లో ఇలాంటి ప్రతిభ ఉన్న ఆటగాణ్ని ఎప్పుడూ చూడలేదని చెప్పాడు. యువ ఆటగాళ్లు తమ సహజ శైలిలో ఆడేందుకు ఇప్పుడు భారత క్రికెట్‌లో మంచి వాతావరణం ఏర్పడిందని పేర్కొన్నాడు.

వైభవ్ ఐపీఎల్ అరంగేట్రానికి ముందు జరిగిన ఓ సంఘటనను కూడా హర్భజన్ గుర్తు చేశాడు. తొలి బంతిని ఎలా ఆడతావని కోచ్ రాహుల్ ద్రవిడ్ అడగ్గా, తనకు అనుకూలంగా వస్తే సిక్సర్ కొడతానని వైభవ్ చెప్పాడని, చెప్పినట్టుగానే శార్దూల్ ఠాకూర్ వేసిన తొలి బంతికే సిక్సర్ బాదాడని వెల్లడించాడు.

ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. తొలి సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్‌కు అతడిని మళ్లీ ఎంపిక చేయడంతో తన ప్రతిభను నిరూపించుకునే మరో అవకాశం లభించింది.