భారత్‌లో ఐఫోన్ 17దే హవా.. యాపిల్ అమ్మకాలలో 44 శాతం వాటా
- ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ 17
- సైబర్ మీడియా రీసెర్చ్ వెల్లడి
- ఐఫోన్ 16 సిరీస్ 40 శాతం వాటాతో రెండో స్థానం
- ఐఫోన్ 15 సిరీస్‌కు ఇంకా ఆదరణ కొనసాగుతున్నట్లు నివేదిక
- ఫోల్డబుల్ ఐఫోన్ విడుదలతో అమ్మకాలు పెరిగే అవకాశం
భారత్‌లో 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో యాపిల్‌కు చెందిన ఐఫోన్ 17 సిరీస్ అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. ఈ సిరీస్ ఒక్కటే కంపెనీ మొత్తం ఐఫోన్ సరఫరాల్లో 44 శాతం వాటాను దక్కించుకున్నట్లు సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) వెల్లడించింది.
సీఎంఆర్ నివేదిక ప్రకారం.. ఐఫోన్ 16 సిరీస్ 40 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఐఫోన్ 17ఈ 6 శాతం, ఐఫోన్ 16ఈ 5 శాతం, ఐఫోన్ 15 సిరీస్ 4 శాతం షిప్‌మెంట్‌లను నమోదు చేశాయి. కొత్త మోడళ్లు వచ్చినప్పటికీ ఐఫోన్ 15 సిరీస్‌కు ఇంకా మార్కెట్‌లో ఆదరణ కొనసాగుతున్నట్లు నివేదిక పేర్కొంది.
ఐఫోన్ 18 సిరీస్ విడుదలకు ముందు ఏప్రిల్-జూన్ త్రైమాసికం సాధారణంగా యాపిల్‌కు మందగమన కాలమని, ఈసారి మెమరీ చిప్‌ల కొరత కూడా షిప్‌మెంట్లపై ప్రభావం చూపిందని సీఎంఆర్ విశ్లేషించింది.
అయితే పండగల సీజన్‌లో యాపిల్ మళ్లీ జోరు పెంచే అవకాశం ఉందని అంచనా వేసింది. కంపెనీ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ విడుదలతో అమ్మకాలు మరింత పెరిగే అవకాశముందని పేర్కొంది. 2026 చివరి నాటికి భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యాపిల్ వాటా 12 శాతానికి, ట్యాబ్లెట్ మార్కెట్లో 30 శాతానికి చేరే అవకాశముందని సీఎంఆర్ అంచనా వేసింది.