Advertisement

షూటింగ్‌లో బాలకృష్ణకు గాయం... హెల్త్ బులెటిన్ విడుదల!

Balakrishna injured during shooting health bulletin released
  • కాకినాడ పోర్ట్‌లో షూటింగ్ జరుగుతుండగా గాయపడ్డ బాలయ్య
  • హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స
  • మోకాలి చుట్టూ ఉన్న కణజాలాలలో రక్తం గడ్డకట్టిందన్న వైద్యులు

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 'NBK111' సినిమా షూటింగ్‌ సందర్భంగా బాలకృష్ణ ప్రమాదవశాత్తూ గాయపడిన సంగతి తెలిసిందే. కాకినాడ పోర్ట్‌లో ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం ఆయన్ను ఎయిర్‌లిఫ్ట్ ద్వారా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశాయి.


బాలకృష్ణ ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలాలలో రక్తం గడ్డకట్టడంతో పాటు వాపు ఉన్నట్లు డయాగ్నస్టిక్ పరీక్షల్లో తేలింది. ఇది కండరాల క్షతాన్ని (మజిల్ టేర్) సూచిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆర్థోపెడిక్ సర్జన్లతో పాటు ఆయన గత వైద్య చరిత్రను పరిగణనలోకి తీసుకుని, వివిధ విభాగాల నిపుణులతో కూడిన 'మల్టీడిసిప్లినరీ బృందం' చికిత్స విధానాన్ని పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బాలయ్య ఆరోగ్యం నిలకడగా ఉండి వైద్యుల నిరంతర సంరక్షణలో ఉన్నారని స్పష్టం చేశారు.

Advertisement
Balakrishna
NBK111
Gopichand Malineni
AIG Hospital Hyderabad
Balakrishna Health Update
Balakrishna Shooting Injury

More Telugu News