మూడో రోజూ కుప్పకూలిన మార్కెట్లు.. 715 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిన ముడి చమురు ధరలు
- రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి
- 191.45 పాయింట్లు కోల్పోయి 23,996.25 వద్ద ముగిసిన నిఫ్టీ
- 76,755.05 వద్ద స్థిరపడ్డ సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్‌లోనూ భారీ నష్టాలతో ముగిశాయి. రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ముడిచమురు ధరలు పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో సెన్సెక్స్ 715.06 పాయింట్లు (0.92 శాతం) పతనమై 76,755.05 వద్ద ముగియగా, నిఫ్టీ 191.45 పాయింట్లు (0.79 శాతం) కోల్పోయి 23,996.25 వద్ద స్థిరపడింది. దీంతో కీలకమైన 24,000 స్థాయి దిగువకు నిఫ్టీ చేరింది.
మార్కెట్ నిపుణుల ప్రకారం నిఫ్టీకి 24,200 స్థాయి కీలక నిరోధంగా మారింది. ఈ స్థాయిని దాటితేనే మార్కెట్లో మళ్లీ కొనుగోళ్ల జోరు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు 24,000 దిగువన కొనసాగితే మరింత అమ్మకాల ఒత్తిడి పెరిగి నిఫ్టీ 23,900-23,800 స్థాయుల వరకు పడిపోయే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
నిఫ్టీలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 1.09 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 1.54 శాతం చొప్పున పడిపోయాయి.
రంగాల వారీగా చూస్తే నిఫ్టీ రియాల్టీ, మీడియా సూచీలు చెరో 2.6 శాతం క్షీణించాయి. ఐటీ, ఫార్మా, ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లు కూడా దాదాపు ఒక శాతం మేర నష్టపోయాయి. కొన్ని ఆటో కంపెనీలు అంచనాలకు మించి ఫలితాలు ప్రకటించినప్పటికీ, ముడిచమురు ధరల పెరుగుదల, ఫార్మా దిగుమతులపై అమెరికా టారిఫ్‌ల భయం వంటి అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయని విశ్లేషకులు పేర్కొన్నారు.