తెలంగాణ జూలు పట్టుకుని జగన్ గబ్బిలంలా వేలాడుతున్నారు!: టీడీపీ నేత రాజేంద్రప్రసాద్
- మోదీ డైరెక్షన్ లోనే జగన్ నడుస్తున్నారు
- జగన్ ఏపీలో ఒక్క రాత్రయినా గడిపారా?
- విజయవాడలో మీడియాతో టీడీపీ నేత
ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఒక్కరాత్రి అయినా రాష్ట్రంలో గడిపారా? అని ప్రశ్నించారు. తెలంగాణ జూలు పట్టుకుని గబ్బిలంలా జగన్ వేలాడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీలోని 40 నదులను అనుసంధానిస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తుచేశారు. నదుల అనుసంధానంతో ఏపీ రూపురేఖలే మారిపోతాయని వ్యాఖ్యానించారు. ఏపీలో టీడీపీ మరోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం తథ్యమన్నారు.