చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కోట్ల.. మూడు ప్రాజెక్టులను మంజూరు చేసిన సీఎం
- కోడుమూరు సభలో టీడీపీలో చేరిన కోట్ల కుటుంబం
- పలువురు కాంగ్రెస్ నేతలు టీడీపీలో చేరిక
- వేదవతి, గుండ్రేవుల, ఎల్లెల్సీ కెనాల్ ప్రాజెక్టులను మంజూరు చేసిన సీఎం
కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కోట్ల... ఫిబ్రవరి 19న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వేదవతి, గుండ్రేవుల, ఎల్లెల్సీ బైపాస్ కెనాల్ ప్రాజెక్టులను ఇస్తే టీడీపీలో చేరుతానని సీఎంకు చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మూడు ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. అంతేకాదు ప్రభుత్వం జీవోలు కూడా జారీ చేసింది.