నిమజ్జనంలో పలుచగా కనిపించిన యువత, తగ్గిన సందడి... కారణమిదే!
- నిమజ్జనం రోజున భారత్, పాక్ క్రికెట్ మ్యాచ్
- హైదరాబాద్ లో పెరిగిన కొలనుల సంఖ్య
- పదో రోజునే 9 వేల విగ్రహాల నిమజ్జనం
శనివారం నాడు దాదాపు 9 వేల విగ్రహాలు నిమజ్జనానికి వచ్చాయి. 11వ రోజు నిమజ్జనానికి రిజిస్టర్ చేసుకున్న విగ్రహాల్లో చాలామటుకు ఒక రోజు ముందే హుసేన్ సాగర్ కు తరలివచ్చాయి. దీనికితోడు నిమజ్జనానికి సిద్ధం చేసిన కొలనుల సంఖ్య పెరగడంతో, ఒక్కో కొలనులో సగటున 1,500 వరకూ విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఈ కారణాలతో హుస్సేన్ సాగర్ పరిసరాల్లో పెద్దగా యువత సందడి కనిపించలేదు.